భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరుతూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో బుధవారం ఇనుగుర్తి మండల తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దుంపల సందీప్ మాట్లాడుతూ తెలంగాణ విమోచనకు కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వేచ్ఛా ప్రతిమను ఏర్పాటు చేయడంతో పాటు సప్త సంకల్పాలను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన మ్యూజియం, ప్రతి జిల్లాలో విమోచన స్మృతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని…





