భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తండా గిరిజనులతో పాటు సి.ఆర్. తండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మంలోని ప్రముఖ గ్యాస్ట్రో, లివర్ సెంటర్‌గా గుర్తింపు పొందిన సాయిరాం హాస్పిటల్స్, జంగాల రాజేశ్వర్‌రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సాయిరాం హాస్పిటల్స్ అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ఈ శిబిరంలో గ్యాస్ట్రో, లివర్, ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన సమస్యలతో పాటు కిడ్నీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రో, గ్యాస్ట్రో మెడిసిన్, ఆంకాలజీ, కార్డియాలజీ, డయాబెటిక్, సైనస్, ఆప్తమాలజీ, జనరల్ సర్జన్, డెర్మటాలజీ తదితర విభాగాలకు చెందిన గుర్తింపు పొందిన వైద్యులు పాల్గొన్నారు. మొత్తం 120 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.
జంగాల రాజేశ్వర్‌రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్, సాయిరామ్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సాయిరామ్ హాస్పిటల్స్ ఎం.డి., డి.ఎం. డాక్టర్ జంగాల సునీల్ కుమార్ జంగాల, డాక్టర్ స్వాతి జంగాల, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ తబస్సుమ్, జంగాల రాజేశ్వర్‌రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డైరెక్టర్ సామ్యూల్ గెడ్డం, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.