భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని వద్ది రాజు నారాయణ మెమోరియల్ పార్కులో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కమిటీ ఉపాధ్యక్షులు షేక్ యాకూబ్ పాషా, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, కోశాధికారి జాటోత్ సంతోష్, సంయుక్త కార్యదర్శి కూటికంటి మధు గౌడ్లకు బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు దుంపల సందీప్ మాట్లాడుతూ మండలంలో నూతనంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాలకు, ప్రజలకు, వివిధ రాజకీయ పక్షాలకు మధ్య వారధులుగా ఉంటూ విమర్శలు, సద్విమర్శలతో ప్రజలను చైతన్యపరచాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా వార్తలను ప్రచురించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు పోలేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శులు వల్లముల రాజేందర్, కుల్ల వెంకన్న, బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కల్సాని ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల నాయకులు మందుల బాబు, యువ మోర్చా మండల నాయకులు సందీప్ పాల్గొన్నారు.