భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని వద్ది రాజు నారాయణ మెమోరియల్ పార్కులో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కమిటీ ఉపాధ్యక్షులు షేక్ యాకూబ్ పాషా, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, కోశాధికారి జాటోత్ సంతోష్, సంయుక్త కార్యదర్శి కూటికంటి…





