భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

చీన్య తండాలో మహిళలకు 100 చీరల వితరణ

చీన్య తండాలో.. సర్పంచి హరిచంద్ 100 చీరలు వితరణ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని చీన్య తండాలో మహిళలకు సర్పంచి, బంజారా సేవాలాల్ మండల అధ్యక్షులు జాటోతు హరిచంద్ నాయక్ బుధవారం చీరలు వితరణ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచి జాటోతు హరిచంద్ నాయక్ మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సేవలో భజనలు, నృత్య ప్రదర్శనలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మహిళలకు ఏకరూప దుస్తులు ఉండాలనే సంకల్పంతో రూ.30 వేల విలువైన 100 చీరలను అందజేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తండా గిరిజన మహిళలు మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంతో పాటు దైవభక్తిని పెంపొందించేలా చీరలు వితరణ చేసిన సర్పంచి హరిచంద్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి గుగులోతు కవిత, వార్డు సభ్యులు గుగులోతు బిచ్చ, అజ్మీర లక్ష్మి, ఇస్లావత్ చందులాల్ తదితరులు పాల్గొన్నారు.