భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని చీన్య తండాలో మహిళలకు సర్పంచి, బంజారా సేవాలాల్ మండల అధ్యక్షులు జాటోతు హరిచంద్ నాయక్ బుధవారం చీరలు వితరణ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచి జాటోతు హరిచంద్ నాయక్ మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సేవలో భజనలు, నృత్య ప్రదర్శనలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మహిళలకు ఏకరూప దుస్తులు ఉండాలనే సంకల్పంతో రూ.30 వేల విలువైన 100…