భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చందు రాజ్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లికుదురు మండల తహసీల్దార్ చంద నరేష్‌కు వినతి పత్రం అందజేశారు.

అనంతరం చందు రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ విమోచనకు కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వేచ్ఛా ప్రతిమను ఏర్పాటు చేయడంతో పాటు సప్త సంకల్పాలను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన మ్యూజియం, ప్రతి జిల్లాలో విమోచన స్మృతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, అమరవీరుల అధికారిక జాబితాను రూపొందించాలని డిమాండ్ చేశారు. చారిత్రక గ్రామాల్లో విమోచన స్మారక స్తూపాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి యాకి రెడ్డి, కొప్పు లక్ష్మణ్, జల్ల రమేష్, సలుగు ప్రవీణ్, శివ సాయి గౌడ్, తోట రమేష్, కనుకుట్ల శ్రీకాంత్, తోట సురేష్, శ్రవణ్, దాసరి రాజశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.