భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చందు రాజ్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లికుదురు మండల తహసీల్దార్ చంద నరేష్‌కు వినతి పత్రం అందజేశారు.

అనంతరం చందు రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ విమోచనకు కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వేచ్ఛా ప్రతిమను ఏర్పాటు చేయడంతో పాటు సప్త సంకల్పాలను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన మ్యూజియం, ప్రతి జిల్లాలో విమోచన…