భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

17 నుంచి బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్

17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్..                                     బిజెపి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి నెల్లికుదురు మండలంలో నెలరోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు చందు రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు.

ఈ మేరకు బుధవారం నెల్లికుదురులో పార్టీ మండల ముఖ్య నాయకులతో సమావేశమై కార్యక్రమ నిర్వహణపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా చందు రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాస యాకిరెడ్డి, మండల నాయకులు పెరుమాళ్ల శివ సాయి గౌడ్, కొప్పు లక్ష్మణ్, జల్ల రమేష్, సెలవు ప్రవీణ్, తోట రమేష్, కనుకుంట్ల శ్రీకాంత్, నవీన్, తోట సురేష్, దాసరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.