భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి నెల్లికుదురు మండలంలో నెలరోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు చందు రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు.
ఈ మేరకు బుధవారం నెల్లికుదురులో పార్టీ మండల ముఖ్య నాయకులతో సమావేశమై కార్యక్రమ నిర్వహణపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా చందు రాజ్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలను…





