భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

జీపీ భవనం ప్రారంభానికి కాలయాపన తగదు: సర్పంచి కుమార్

జిపి భవనం ప్రారంభానికి కాలయాపన తగదు                                  సర్పంచి కుమార్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తి మేజర్ గ్రామపంచాయతీ నూతన భవన ప్రారంభానికి కాలయాపన తగదని ఆ గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్ అన్నారు. ఉపసర్పంచి సత్తూరి యాదగిరి, వార్డు సభ్యులతో కలిసి సర్పంచి బుధవారం నూతన భవనాన్ని సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత గ్రామపంచాయతీ భవనం వర్షం పడిన సమయంలో పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పాలనాపరమైన కార్యకలాపాలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు.

నూతన జీపీ భవనం ప్రారంభానికి సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపనకు గురిచేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సర్పంచి అన్నారు. వెంటనే భవనాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.