భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవానికి పోస్టర్ ఆవిష్కరణ

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు శీలం స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి చంద్రభాను నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 27న యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్, జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణంలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భువనగిరి జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనంతరం భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా కొలను శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మారగొని శ్రీనివాస్, జిల్లా గౌరవ సలహాదారుగా బొడిగె సుదర్శన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ చీమ శ్రీనివాస్, కొలను శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిట్టా బాలకృష్ణారెడ్డి ఆశయ సాధన కోసం ఉద్యమకారులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సభ్యులు గుండు దయానంద్, జగన్ యాదవ్, శ్యామల ముదిరాజ్‌తో పాటు జిల్లా నాయకులు బట్టు రామచంద్రయ్య, శ్రీనివాస్ గౌడ్, సాయిలు, శంకర్ రెడ్డి, పాండు, సాయిరెడ్డి, నరసింహ, సుదర్శన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.