భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు శీలం స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి చంద్రభాను నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 27న యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్, జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణంలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ…