భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

మెండోరా సహకార కేంద్ర బ్యాంకులో రూ.50 కోట్లకు పైగా లావాదేవీలు

మెండోరా సహకార కేంద్ర బ్యాంకులో రూ.50 కోట్లకు పైగా లావాదేవీలు

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండల కేంద్రంలోని సహకార కేంద్ర మెండోరా లిమిటెడ్ బ్యాంకు (ఎన్‌డీసీసీ) ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా లావాదేవీలు జరగడం అభినందనీయమని బ్యాంకు సీఈఓ వందే నాగభూషణం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుమన్ ఆనందం వ్యక్తం చేశారు.

మెండోరా సహకార కేంద్ర బ్యాంకులో రూ.50 కోట్లకు పైగా లావాదేవీలు

ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ గోవిందుల చంద్రమోహన్ చారి బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులను అభినందించారు. బ్యాంకులో సీఈఓ కేక్ కట్ చేసి సిబ్బందితో సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం బ్యాంకు ఆవరణలో మొక్కలు నాటారు.

మెండోరా సహకార కేంద్ర బ్యాంకులో రూ.50 కోట్లకు పైగా లావాదేవీలు

సీఈఓ మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంకు ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోనే అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల్లో ఎన్‌డీసీసీ బ్యాంకు ముందంజలో ఉందని పేర్కొన్నారు. బ్యాంకులోని ‘సంపద’ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వరకు వడ్డీ లభిస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా వచ్చే ఆదాయానికి ఇతర బ్యాంకుల్లో సమానమైన ప్రయోజనాలు అందుబాటులో లేవని సీఈఓ నాగభూషణం పేర్కొన్నారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘కర్షకమిత్ర’ రుణాలు, గోల్డ్ లోన్లు తదితర రుణ సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీ) సుమారు 104 సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తూ, రైతులు, ఖాతాదారుల ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.