భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండల కేంద్రంలోని సహకార కేంద్ర మెండోరా లిమిటెడ్ బ్యాంకు (ఎన్‌డీసీసీ) ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా లావాదేవీలు జరగడం అభినందనీయమని బ్యాంకు సీఈఓ వందే నాగభూషణం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుమన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ గోవిందుల చంద్రమోహన్ చారి బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులను అభినందించారు. బ్యాంకులో సీఈఓ కేక్ కట్ చేసి సిబ్బందితో సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం బ్యాంకు ఆవరణలో మొక్కలు నాటారు.
…






