భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని ఓ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరాస్వర్ సాయిలు, డిప్యూటీ తహశీల్దార్ ఖాలీద్, గ్రామ సర్పంచ్ దేవుకత్తె జయశ్రీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుల వినియోగం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన చివరి వ్యక్తికి చేరేలా కృషి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండా గంగాధర్, ఇరన్న, బండి గోపి, ఉప సర్పంచ్ దేవుకత్తె కవిత, విట్టల్ రావు, గ్రామ అధ్యక్షుడు శ్రీపద్ సంజు, లూటే ప్రకాష్‌తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.