భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

నిజామాబాద్‌లో హామారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. భారీ నిరసన

నిజామాబాద్‌లో హామారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. భారీ నిరసన

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హామారా ప్రసాద్ దిష్టిబొమ్మను దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో అన్ని కుల సంఘాల నాయకులు, సభ్యుల సమక్షంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను గౌరవిస్తున్నాయని, ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి స్మరించుకుంటున్నారని తెలిపారు. అలాంటి మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కల్పిత నాయకుడిగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటని నాయకులు పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం వెంటనే స్పందించి హామారా ప్రసాద్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గైని గంగారం, బంగారు సాయిలు, షేక్ హుస్సేన్, విజయ్ కుమార్‌తో పాటు దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.