భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హామారా ప్రసాద్ దిష్టిబొమ్మను దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో అన్ని కుల సంఘాల నాయకులు, సభ్యుల సమక్షంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను గౌరవిస్తున్నాయని, ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి స్మరించుకుంటున్నారని తెలిపారు. అలాంటి మహనీయుడిపై…