భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ కలెక్టరేట్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి గురువారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టరేట్లో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్దకు చేరుకున్న కలెక్టర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రత్యేక పూజల సందర్భంగా గణనాథుడికి పుష్పాలు సమర్పించి, ఆయా పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూజారులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు తీర్థప్రసాదాలు అందజేశారు. కలెక్టరేట్లో కొలువుదీరిన గణనాథుడి సన్నిధిలో అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడికి అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారురు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా ప్రజలకు విఘ్నేశ్వడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేష్, కార్యాలయ పర్యవేక్షకులు ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.