భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ కలెక్టరేట్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడికి గురువారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్దకు చేరుకున్న కలెక్టర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రత్యేక పూజల సందర్భంగా గణనాథుడికి పుష్పాలు సమర్పించి, ఆయా పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూజారులు జిల్లా కలెక్టర్ భవేశ్…





