భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రామాయంపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

రామాయంపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు సూచనల మేరకు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

రామాయంపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ప్రారంభమైన పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎందరో అమరుల త్యాగాలు, పోరాటాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది.

రామాయంపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

తెలంగాణ అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్న మున్సిపల్ చైర్మన్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ చేసిన కృషిని ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పాటుతో అనేక సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

రామాయంపేటలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజాపాలన మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.