భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

విశ్వకర్మల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

విశ్వకర్మల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, గనుల, భూగర్భ శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని విశ్వకర్మల సమస్యలు, వారి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు.

ముందుగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెదక్ పట్టణంలో నిర్వహించిన భగవాన్ విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంప్రదాయ వృత్తులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విశ్వకర్మలు మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. విశ్వకర్మల కోసం ఏటీసీలలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించేలా సిఫారసు చేస్తామని తెలిపారు. అలాగే రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో విశ్వకర్మలకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

విశ్వకర్మల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

విశ్వకర్మలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తమ వృత్తుల్లో మరింత నైపుణ్యాన్ని పెంచుకోవాలని మంత్రి సూచించారు. విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విశ్వకర్మల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన చర్యలపై ప్రభుత్వ స్థాయిలో చర్చించి, వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ మెంచు నగేష్, ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ శివరామకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ నవీన్ చారి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ నర్సింలు, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఇన్‌స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే విశ్వకర్మ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పూనా రవి చారి, శ్రీనివాస్ చారి, సంగయ్య చారి, శంకర్ దయాల్ చారి, శ్రీనివాస్ చారి మిన్పూర్, నరసింహ చారి, వేణు చారి, కరాటే నగేష్ చారి, రాచపల్లి శ్రీనివాస్ చారి, ప్రవీణ్ చారి, మహేశ్వరాచారి ఆచార్యులు, నవీన్ చారి, చదువుల యాదగిరి, శ్రీనివాస్ చారి, సీనియర్ నాయకులు లక్ష్మీకాంతం చారి, సత్యనారాయణ చారి, శంకరయ్య చారి, విశ్వకర్మ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, గంగాధర్, అశోక్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.