భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఆదివాసులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే

మెదక్ జిల్లా  ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ శిరస్సు వరకు గిరిజనులతో ర్యాలీ..   ఆదివాసులకు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆదివాసులు, బంజారాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఘనత దక్కుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్‌ నడిబొడ్డున జూబ్లీహిల్స్‌లో ఆదివాసీ భవన్, బంజారా భవన్‌లను నిర్మించినట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. గతంలో ఉన్న గిరిజన రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచిన ప్రభుత్వం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చినట్లు తెలిపారు.

మెదక్ జిల్లా  ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ శిరస్సు వరకు గిరిజనులతో ర్యాలీ..   ఆదివాసులకు

గిరిజనులకు రిజర్వేషన్లను పెంచి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్న ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గిరిజన హక్కులు, సంక్షేమం, గతంలో అమలు చేసిన కార్యక్రమాలను ప్రస్తావించారు.

అనంతరం నర్సాపూర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి గిరిజనులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం, రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలను ఎమ్మెల్యే మరోసారి ప్రస్తావించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.