భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆదివాసులు, బంజారాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఘనత దక్కుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్‌ నడిబొడ్డున జూబ్లీహిల్స్‌లో ఆదివాసీ భవన్, బంజారా భవన్‌లను నిర్మించినట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. గతంలో ఉన్న గిరిజన…