భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

గీతం విశ్వవిద్యాలయంలో హౌస్ కీపింగ్ వారోత్సవాలు

అంతర్జాతీయ హౌస్కీపింగ్ వారోత్సవాలు

భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు-2026 ఘనంగా నిర్వహించారు. ‘ప్రతి శుభ్రమైన ప్రదేశం వెనుక శ్రద్ధ వహించే బృందం ఉంటుంది’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హౌస్ కీపింగ్ సిబ్బంది సేవలను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు.

ఈ సందర్భంగా అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, డైరెక్టర్ అంబికా ఫిలిప్ హౌస్ కీపింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో హౌస్ కీపింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

అంతర్జాతీయ హౌస్కీపింగ్ వారోత్సవాలు

కార్యక్రమంలో భాగంగా గణేశ వందనం నిర్వహించారు. అనంతరం హౌస్ కీపింగ్ సిబ్బంది సేవలు, వారి విధుల ప్రాధాన్యతను ప్రతిబింబించేలా వీడియో ప్రదర్శించారు. సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచేలా పలు ఆటలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హౌస్ కీపింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది. సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని ప్రోత్సహించడం ద్వారా సంస్థలో పరస్పర గౌరవం, బృంద స్ఫూర్తిని మరింత పెంపొందించేందుకు ఈ వేడుకలు దోహదపడ్డాయి.