భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు-2026 ఘనంగా నిర్వహించారు. ‘ప్రతి శుభ్రమైన ప్రదేశం వెనుక శ్రద్ధ వహించే బృందం ఉంటుంది’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హౌస్ కీపింగ్ సిబ్బంది సేవలను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు.
ఈ సందర్భంగా అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, డైరెక్టర్ అంబికా ఫిలిప్ హౌస్ కీపింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని…






