భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ప్రజా పాలనతో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రజా పాలనతో రాష్ట్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. నిర్మల్ పట్టణంలో ఆయన ఆధ్వర్యంలో గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంబడి రాజేశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్న శుభ సందర్భంలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పట్టణంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అనంతరం నిర్మల్ పట్టణంలోని రాంజీ గోండు వెయ్యి ఊడల మర్రి స్మారకం వద్ద నాయకులు నివాళులు అర్పించారు. రాంజీ గోండు పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన స్మారకానికి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల హరీష్, ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అర్షద్, స్పోక్స్‌పర్సన్ సజ్జద్, నాంపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.