భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రజా పాలనతో రాష్ట్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. నిర్మల్ పట్టణంలో ఆయన ఆధ్వర్యంలో గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంబడి రాజేశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ…





