భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ప్రజలకు సేవ చేయడం అందరి బాధ్యత: తహసీల్దార్ నరేష్

ప్రజలకు సేవ చేయడం అందరి బాధ్యత..                             తహసిల్దార్ నరేష్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని సెప్టెంబర్ 17 గుర్తు చేస్తుందని తెలిపారు.

ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తహసీల్దార్ నరేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ సూచించారు. ప్రజల సమస్యలను బాధ్యతగా స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజా పాలన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, జీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు సేవ చేయడం అందరి బాధ్యత..                             తహసిల్దార్ నరేష్

ఎంపీడీవో కార్యాలయంలో..

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో కూడా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలనను మరింత పారదర్శకంగా, ప్రజలకు చేరువగా అందించేందుకు ఉద్యోగులు పునరంకితం కావాలని కోరారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రతి ఉద్యోగి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఎంపీడీవో కుమార్ సూచించారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.