భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని సెప్టెంబర్ 17 గుర్తు చేస్తుందని తెలిపారు.

ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి…