భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

హనుమాన్ నగర్ తండాలో స్మార్ట్ కార్డుల పంపిణీ

హనుమాన్ నగర్ తండాలో స్మార్ట్ కార్డుల పంపిణీ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో గురువారం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయంలో ముందుగా స్థానిక సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

తర్వాత తండావాసులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ కార్డులను పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుతో కలిసి సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అని ఆయన పేర్కొన్నారు.

హనుమాన్ నగర్ తండాలో స్మార్ట్ కార్డుల పంపిణీ..

అనంతరం హనుమాన్ నగర్ తండాలోని స్థానిక పాఠశాలలో విద్యార్థులకు పారిశుధ్యం, శానిటేషన్‌పై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి గుగులోతు శ్రీలత, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు, పంచాయతీ సిబ్బంది, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.