భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో గురువారం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయంలో ముందుగా స్థానిక సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
తర్వాత తండావాసులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ కార్డులను పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుతో కలిసి సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల ద్వారా…






