భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ప్రపంచ సృష్టికర్తగా కొలిచే విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు పోలోజు ఈశ్వర చారి నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పోలోజు ఈశ్వర చారి మాట్లాడుతూ విశ్వకర్మ స్వయంభువుగా వెలసిన దైవిక శిల్పి, సృష్టికర్తగా పురాణాల్లో విశిష్ట స్థానం కలిగి ఉన్నారని తెలిపారు. శ్రీకృష్ణుడి కోసం ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ పురాన్ని నిర్మించిన విశ్వకర్మ దేవతలకు అనేక ఆయుధాలను తయారుచేసి అందించిన దైవిక శిల్పిగా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
వేడుకల్లో భాగంగా గ్రామంలోని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని విశ్వకర్మ భగవానుడిని ప్రార్థించారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, మాజీ సర్పంచ్ బైరు చిన్న బాలయ్య గౌడ్, వార్డు సభ్యులు మునిగంటి సరిత రాజు చారి, గుండాల మంగమ్మ ధర్మయ్య, చెడుపాక అలివేలు వెంకన్న, రిటైర్డ్ ఏఎస్ఐ పోలోజు మదనాచారి, విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ కొయ్యడి ఏకాంతం గౌడ్, బైరు శ్రీనివాస్ గౌడ్, పోలోజు సోమ సత్యనారాయణ చారి, బ్రహ్మచారి, మునిగంటి డిష్ వెంకన్న, జొన్నలగడ్డ కార్తీక్ రెడ్డి, వట్టె తిరుమల్ రెడ్డి, మహిళా భక్తులు పోలోజు భారతమ్మ, వజ్రమ్మ, పుష్పలీల, నిర్మల, జయమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.