భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ప్రపంచ సృష్టికర్తగా కొలిచే విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు పోలోజు ఈశ్వర చారి నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పోలోజు ఈశ్వర చారి మాట్లాడుతూ విశ్వకర్మ స్వయంభువుగా వెలసిన దైవిక శిల్పి, సృష్టికర్తగా పురాణాల్లో విశిష్ట స్థానం…






