భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దుంపల సందీప్ మాట్లాడుతూ.. నిజాం పాలనలో తెలంగాణ సమాజం ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో తెలంగాణ విముక్తి పొందిందని పేర్కొన్నారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17న సిద్ధించిందని ఆయన అన్నారు.

సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ తరఫున పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావడం లేదని సందీప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వచ్చే సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాలేరు నేతాజీ, పటేల్ రవి గౌడ్, డా. వెంకటేశ్వర్లు, గాయపు సురేందర్ రెడ్డి, మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.