భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దుంపల సందీప్ మాట్లాడుతూ.. నిజాం పాలనలో తెలంగాణ సమాజం ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో తెలంగాణ విముక్తి పొందిందని పేర్కొన్నారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం…