భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ వేడుక పోస్టర్ ఆవిష్కరణ

ఫోరం ఆవిర్భావ వేడుక పోస్టర్ ఆవిష్కరణ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఈనెల 27న యాదగిరిగుట్టలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ 9వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం నెల్లికుదురు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి కోట్ల మౌనేందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు విరగాని మల్లేశం గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ.. ఈనెల 27న యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ 9వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు సహకరించాలని పిలుపునిచ్చారు.

జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు అధిక సంఖ్యలో యాదగిరిగుట్టకు తరలివచ్చి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని వారు కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులంతా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సుధగాని ఉపేందర్, గొడుగు రామకృష్ణ, బొమ్మరాతి నాగన్న తదితరులు పాల్గొన్నారు.