భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

కరెంట్ సమస్యలపై లోకల్ కోర్టులో బీజేపీ నేత వినతి

కరెంట్ సమస్యలపై లోకల్ కోర్టులో బిజెపి నేత వినతి..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నెల్లికుదురు మండలం మునిగలవీడు కరెంటు సబ్‌ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన లోకల్ కోర్టులో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లాని పాపారావు వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా నల్లాని పాపారావు మాట్లాడుతూ.. మునిగలవీడు గ్రామపంచాయతీ పరిధిలోని మంచినీటి బావి ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్‌-ఆఫ్‌ స్విచ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బంజరకు చెందిన విద్యుత్ ఫీడర్‌ను మునిగలవీడు నుంచి నర్సింహులగూడెం సబ్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా 11 కేవీ లైన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, సబ్‌స్టేషన్‌కు వచ్చే కొమ్ములంచ పెద్ద లైన్ వద్ద 33/11 కేవీ స్విచ్ సమీపంలో కొమ్మనమైన ముఖేష్ పొలంలో పెద్ద పోల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలోని విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు అందజేసినట్లు పాపారావు తెలిపారు.

ఈ సందర్భంగా పాపారావు వెంట బైసా పెద్ద లింగయ్య పాల్గొన్నారు. లోకల్ కోర్టు కార్యక్రమంలో టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం (సీజీఆర్‌ఎఫ్‌-1) చైర్‌పర్సన్ కె. మాధవరావు, టెక్నికల్ మెంబర్ ఆర్. శేషారావు, ఫైనాన్స్ మెంబర్ ఎస్. సత్యనారాయణ, ఇండిపెండెంట్ మెంబర్ ఎం. రామారావుతో పాటు జిల్లా, మండల విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.