భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

నెల్లికుదురులో తెలంగాణ విమోచన దినోత్సవం

నెల్లికుదురులో బిజెపి ఆధ్వర్యాన విమోచన దినోత్సవం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురులో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చందు రాజకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చందు రాజకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో తెలంగాణ విముక్తి పొందిందని పేర్కొన్నారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17న సిద్ధించిందని ఆయన అన్నారు.

సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావడం లేదని చందు రాజకుమార్ యాదవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వచ్చే సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాస యాకిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వంగాల రామచంద్రు, నాయకులు కోటగిరి అశోక్, తోట రమేష్, సలుగు ప్రవీణ్, దేవేందర్ రెడ్డి, సంపత్ రావు, సమ్మీ రెడ్డి, భాను ప్రసాద్, మోహన్ రావు, మల్ల రెడ్డి, సోమన్న, పెరుమాండ్ల శివసాయి శ్రీనాథ్, ఆకుల లింగయ్య, తోట సురేష్, నర్సింహాచారి, గుంశావాలి, ఎరపుల వీరాస్వామి, మహేందర్, ప్రసాద్, దాసరి శేఖర్, లింగరాజు, అక్కర మహేష్, అశోక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.