భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల

గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష (కర్ర) గణపతిని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌తో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ.. మోక్ష (కర్ర) గణపతిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న విధానం అభినందనీయమని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిస్తూ పోలీసులకు సహకరిస్తున్న అబ్దుల్లాపూర్ గ్రామ ప్రజలను జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి సెల్ఫీ తీసుకుని, వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. గ్రామంలో అందరూ ఐకమత్యంతో కలిసి ఒకే ఒక్క గణపతిని ప్రతిష్టించి, ఎలాంటి డీజేలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు.

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా గణేష్ ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తూ సోదరభావం, ఐక్యతను చాటుతున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం గ్రామ పెద్దలు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలను శాలువాతో సన్మానించి, మోక్ష (కర్ర) గణపతి ప్రత్యేకతలను వివరించారు.

ఈ కార్యక్రమంలో సీఐలు రవీందర్ నాయక్, మల్లేష్, ఎస్సై ప్రదీప్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.