భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష (కర్ర) గణపతిని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌తో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ.. మోక్ష (కర్ర) గణపతిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు…