భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

విద్యార్థులకు పాఠశాల దుస్తులు, బూట్లు అందజేత

విద్యార్థులకు పాఠశాల దుస్తులు, బూట్లు అందజేత

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలం బుస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠశాల దుస్తులు, బూట్లను సర్పంచ్ నూతపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సతీష్ అందజేశారు. విద్యార్థులకు దుస్తులు, బూట్లను పంపిణీ చేసి వారితో ఆత్మీయంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రాగిజావ తదితర పథకాలను ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వివిధ రకాల సౌకర్యాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఓ. రమేష్, ఉపాధ్యాయులు అరుంధతి, నవనీత, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.