భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలం బుస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠశాల దుస్తులు, బూట్లను సర్పంచ్ నూతపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సతీష్ అందజేశారు. విద్యార్థులకు దుస్తులు, బూట్లను పంపిణీ చేసి వారితో ఆత్మీయంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రాగిజావ తదితర పథకాలను ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు.…