భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బాధిత కుటుంబానికి పద్మాదేవేందర్ రెడ్డి భరోసా

బాధిత కుటుంబానికి పద్మాదేవేందర్ రెడ్డి భరోసా

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల సత్యం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించి అండగా నిలిచారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

బాధిత కుటుంబానికి పద్మాదేవేందర్ రెడ్డి భరోసా

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పద్మాదేవేందర్ రెడ్డి.. కష్టకాలంలో బాధిత కుటుంబానికి తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సత్యం మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన వారిలో పార్టీ మండల నాయకులు బండారు గొండ స్వామి యాదవ్, ఉపసర్పంచ్ విజయ్ కుమార్, వార్డు సభ్యులు కందర్ శ్రీనివాస్, చింతల మల్లేశం, పార్టీ నాయకులు ఇండ్ల శ్రీనివాస్, బోయిని రమేష్, సింగం యాదగిరి, నేరెళ్ల రాజేశ్వర్, కుంటల లచ్చయ్య, చరకం యాదగిరి, జంగం స్వామి, చెప్పాల రమేష్, మేకల శ్రీనివాస్, తాళ్ల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.