భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల సత్యం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించి అండగా నిలిచారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పద్మాదేవేందర్ రెడ్డి.. కష్టకాలంలో బాధిత కుటుంబానికి తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సత్యం మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో…






