భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: పర్యావరణ పరిరక్షణలో వెదురు మొక్కలు, వెదురు ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ.. వెదురు మొక్కలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటంతో పాటు వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడవచ్చని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు వెదురు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ వృత్తిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసుకోవాలని డీఆర్ఓ సూచించారు. వెదురుతో వివిధ రకాల ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక మార్కెట్‌తో అనుసంధానం చేస్తే వెదురు ఉత్పత్తుల రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
వెదురు ఉత్పత్తుల తయారీ ద్వారా సంప్రదాయ వృత్తులను కొనసాగించడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రతినిధులు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వెదురు వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, సత్యనారాయణ, జిల్లా మేదర సంఘం ప్రధాన కార్యదర్శి ఊరె దశరథ్, ప్రతినిధులు దూడ ప్రమోద్, ఎనుగందుల రాజేందర్, మదిరె కృష్ణ మోహన్, ఎనుగందుల రాజన్న, కనికరం శేఖర్, జొరిగల రాజలింగం, మదిరె మురళి, కనికరం రవి, మదిరె సత్యనారాయణ, కనికరం రాజేందర్, మాద విజయ్, పిల్లి సాయికుమార్, మదిరె వసంత్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.