భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: పర్యావరణ పరిరక్షణలో వెదురు మొక్కలు, వెదురు ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ.. వెదురు మొక్కలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటంతో పాటు వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి కూడా…





