భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

చిన్ననాగారంలో గణపతి సామూహిక కుంకుమార్చన

చిన్ననాగారంలో ఘనంగా గణపతి సామూహిక కుంకుమార్చన..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో విఘ్నేశ్వర స్వామివారి కుంకుమార్చనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో శ్రీ హనుమాన్ గణపతి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రముఖ వేద పండితులు, అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకులు శ్రీశ్రీశ్రీ తిరునహరి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తులతో పాటు పలువురు దంపతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి కుంకుమార్చన నిర్వహించి విఘ్నేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

ఈ సందర్భంగా కుంకుమార్చనలో కొయ్యడి మల్లయ్య–విజయ, యాకాంతం–శోభ, పంజాల వాసుదేవ–యాకలక్ష్మి, బైరు శ్రీనివాస్–నాగమణి, హరిప్రసాద్–రమ, బొలగాని యాకయ్య–సుమలత, పోలోజు హయగ్రీవాచారి–భాగ్యలక్ష్మి, చిర్రబోయిన కుమార్-శిరీష దంపతులు పాల్గొన్నారు. మహిళా భక్తులు బైరు అమృతమ్మ, ఉడుత పద్మ, పోలోజు పుష్పలీల, జయమ్మ, జ్యోతి, విజయ, సరస్వతి, బైరు సులోచన, సిఆర్పి కవిత, మద్దెల నీరజ, బొబ్బల అరుణ, రాధిక తదితరులు కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే సీనియర్ మాజీ కారోబార్ బైరుప్పలయ్య గౌడ్, శ్రీరాములు గౌడ్, ఉడుత సంతోష్ యాదవ్, బైరు ఝాన్సీ, బొబ్బల ఎల్లమ్మ, పోలోజు భారతమ్మ, వజ్రమ్మ, శ్రీదేవి, పంజాల వేద, బండారి బుచ్చమ్మ, ఏకలక్ష్మి తదితర భక్తులు కార్యక్రమానికి హాజరయ్యారు. స్వామివారి కుంకుమ తిలకాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించి, గణనాథుడి ఆశీస్సులు పొందారు. సామూహిక కుంకుమార్చనతో హనుమాన్ ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో సందడిగా మారింది.