భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో విఘ్నేశ్వర స్వామివారి కుంకుమార్చనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో శ్రీ హనుమాన్ గణపతి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రముఖ వేద పండితులు, అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకులు శ్రీశ్రీశ్రీ తిరునహరి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని…






