భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా శివసాయి గౌడ్

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా శివసాయి గౌడ్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీజేవైఎం నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా మండలంలోని నైనాల గ్రామానికి చెందిన యువ నాయకుడు శివసాయి గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దీదీ మహేష్ నియామక ఉత్తర్వులు జారీ చేసి, నియామక పత్రాన్ని శివసాయి గౌడ్‌కు అందజేశారు.

శివసాయి గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఈ ప్రాంతంలో బీజేపీ కార్యకలాపాల విస్తరణకు కృషి చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. గతంలో యువ మోర్చా మండల ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో యువతను పార్టీ కార్యక్రమాల వైపు ఆకర్షించేలా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

అలాగే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, వాటిపై ఇంటింటా ప్రచారం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో నిర్వహించిన బాధ్యతలు, పార్టీ కార్యక్రమాల్లో చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని బీజేవైఎం మండల అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు శివసాయి గౌడ్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతతో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాల్సిన బాధ్యత పెరిగిందన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవిలో నియమించిన రాష్ట్ర నాయకులతో పాటు బీజేపీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, దీదీ మహేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా, మండల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.